కలం, వెబ్ డెస్క్ : మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం(PPP Model) పెద్ద స్కామ్ అన్నారు మాజీ సీఎం జగన్ (Jagan). ఈ విధానంలో ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతాలు చెల్లించినా.. మేనేజ్ మెంట్ మొత్తం ప్రైవేట్ వాళ్ల చేతుల్లోనే ఉంటుందన్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కోటి సంతకాల ప్రతులను అందజేశారు. మెడికల్ కాలేజీల కోసం ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయకపోతే అలాగే వదిలేయాలని.. తమ ప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తి చేస్తామని చెప్పారు జగన్.
‘సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) కొత్త స్కామ్ లను సృష్టిస్తున్నారు. మాకు క్రెడిట్ వస్తుందేమో అని పేదలకు నష్టం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైజాగ్ కు తలమానికంగా ఉండేలా రిషికొండ బిల్డింగ్ ను రూ.250 కోట్లతో కట్టాం. కానీ అందులో చంద్రబాబు ఒక్క రోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తే రూ.300 కోట్లు ఖర్చు చేశారు. అది మాకు, ఆయనకు ఉన్న తేడా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంను ఒక జిల్లాగా చేసి అందులో ఒక మెడికల్ కాలేజీ, ఒక టీచింగ్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు జగన్. వాటిని రాబోయే రోజుల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా వాటిని డెవలప్ చేసేలా రూపొందించామని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేలా కనిపిస్తోందని ఆరోపించారు. మెడికల్ కాలేజీలకు డబ్బులు పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని విమర్శలు గుప్పించారు జగన్(Jagan).
Read Also: చంద్రబాబు కృషి స్ఫూర్తిదాయకం : పవన్
Follow Us On : WhatsApp


