నోబెల్ జ్యూరీ అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను(Nobel Prize) ప్రకటిస్తోంది. అందులో భాగంగా తొలుత వైద్యశాస్త్రంలో విశేష సేవలను అందించిన ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అమెరికన్ శాస్త్రవేత్తలు మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, జపనీస్ పరిశోధకురాలు షిమోన్ సకాగుచిలకు సంయుక్తంగా ప్రదానం చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పరిధీయ రోగనిరోధక సహనం’ (శరీర బయటి భాగాలలో రోగనిరోధక వ్యవస్థ సహనం) కు సంబంధించిన వారి ఆవిష్కరణలకు ఈ అవార్డు దక్కింది.

