Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో భానుడి భగభగ.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

కలం, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మిన్నంటుతోంది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదు అవుతుండటం, వడగాలులు (Heatwave) వీస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. తెలంగాణ (Telangana) లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న మూడు రోజులు 14, 15, 16వ తేదీలలో ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మధ్యాహ్న వేళల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: హరీశ్ రావు ఆధ్యాత్మిక బాట వెనుక ఆంతర్యమేమిటి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>