అమెరికా పేరు మార్చాలంటున్న ఆర్జీవీ.. కొత్త పేరు సూచ‌న‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ (RGV) తాజాగా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా (America) రాజ‌కీయ ప‌రిణామాలు, డొనాల్డ్ ట్రంప్ వ్య‌వ‌హార శైలిపై స్పందిస్తూ ఆమెరికా పేరు మార్చాల‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా కొత్త పేరు కూడా సూచించారు. అమెరికాను ట్రంపెరికా (Trumperica)గా మార్చాలంటూ త‌న ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. సినీ, రాజ‌కీయ‌, ఆధ్యాత్మిక విష‌యాల‌పై త‌ర‌చూ స్పందించే ఆర్జీవీ త‌న తాజా ఎక్స్ పోస్టుతో నెటిజ‌న్ల దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్ వ్య‌క్తిత్వం, ఆయ‌న‌కు ఉండే క్రేజ్‌, అంత‌ర్జాతీయంగా అమెరికా చూపిస్తున్న ప్ర‌భావాన్ని ఉద్దేవించి వ‌ర్మ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో సైతం ట్రంప్ నాయ‌క‌త్వాన్ని, నిర్ణ‌యాల‌ను వ‌ర్మ స‌మ‌ర్థించారు. ఇక వ‌ర్మ చేసిన ట్రంపెరికా కామెంట్ల‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఆర్జీవీ అటెన్ష‌న్ కోస‌మే ఇలాంటి పోస్టులు పెడ‌తాడ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు ట్రంప్ తీరు చూస్తుంటే ఆర్జీవీ చెప్పింది స‌రైందే అనిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>