కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) హైదరాబాద్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం రాత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav)నివాసానికి అఖిలేశ్ వెళ్లారు. ఆయనకు తలసాని కుటుంబం స్వాగతం పలికింది. తలసాని తన కుటుంబ సభ్యులను అఖిలేశ్ కు పరిచయం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తదితరులు ఉన్నారు. అనంతరం భేటీ అయి దేశ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
కాగా, ఇవాళ ఉదయం హోటల్ తాజ్ కృష్ణ లో సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో విజన్ ఇండియా సమ్మిట్ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) హైదరాబాద్ కు వచ్చారు. మొదటి సమావేశం బెంగళూరులో జరగగా రెండో సమ్మిట్ కు హైదరాబాద్ ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం రామేశ్వరం కేఫ్ లో అఖిలేశ్ యాదవ్ తో కలిసి కేటీఆర్ లంచ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ నేతలతో అఖిలేశ్ యాదవ్ సమావేశం కావడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర రావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందు అని ఆరోపించారు.
Read Also: డ్రైనేజీలో ఓటర్ స్లిప్స్.. ఎమ్మెల్యే వీరేశం రియాక్షన్ ఇదే..!
Follow Us On: Sharechat


