కలం, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ పర్యటనలో భాగంగా రేపు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే ప్రత్యేక మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లతోపాటు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ గేమ్ ఆడతారు. హైదరాబరాద్‌లో జరగబోయే ఫ్రెండ్లీ మ్యాచ్‌కు హాజరు కావాలని ఎఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీలకు ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు హైదరాబాద్‌కు రానున్నాడు. ప్రత్యేక గ్యాలరీలో రాహుల్ గాంధీ మెస్సీ రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను తిలకించనున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ మెస్సీ హోర్డింగ్స్‌తో నిండిపోయింది.
‘‘నాకు ఇష్టమైన ఆట ఫుట్‌బాల్. టీం స్పిరిట్‌ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. తెలంగాణ టీంకు లీడర్‌గా 4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ కంకోల్‌లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశా.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పోస్ట్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
Read Also: ఫుట్‌బాల్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం
Follow Us On: X(Twitter)


