కలం, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ ఇష్టపడే నగరాల్లో కోల్‌కతా (Kolkata) ఒకటి. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) రేపు కోల్‌కతాకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో భారీ ఏర్పాట్లు చేశారు. లేక్ టౌన్ సిటీలో 70 అడుగుల భారీ విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించనున్నారు. ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తుకునేలా మెస్సీ భారీ విగ్రహం తయారైంది. ఈ విగ్రహం కేవలం 40 రోజుల్లోనే రూపుదిద్దుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని బెంగాల్ మంత్రి తెలిపారు. మెస్సీ రాకతో కోల్‌కతాలో ఎక్కడా లేని సందడి నెలకొంది. చివరిసారిగా మెస్సీ 2011లో సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడారు. ఆ తర్వాత చాలా రోజులకు ఆయన కోల్‌కతాకు వస్తుండటంతో క్రీడాభిమానుల్లో కొత్త జోష్ నెలకొంది.
అభిమానులు నీలం, తెలుపు చొక్కాలు ధరించి మెస్సీ (Lionel Messi) పై అభిమానం చాటుకుంటున్నారు. స్థానిక దుకాణాలు అర్జెంటీనా జెర్సీలను అమ్ముతూ మెస్సీ క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటున్నాయి. మెస్సీని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండటంతో నిర్వాహకులు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత వస్తుండటంతో కోల్‌కతా మెస్సీ మేనియాతో ఊగిపోతోంది. ప్రపంచంలోనే మెస్సీ ప్రసిద్ధి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన టూర్ కొనసాగనుంది. దీంతో కేంద్ర బలగాలు గట్టి రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి.
Read Also: జనాభా లెక్కల సేకరణకు రూ. 11,718 కోట్ల కేటాయింపు
Follow Us On: Instagram


