epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి.. నగరంలో పెరిగిన వాయు కాలుష్యం!

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ లో కూడా వాయు కాలుష్యం పెరిగిపోతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. పెరిగిన చలి కారణంగానే హైదరాబాద్‌లో గాలి నాణ్యత పడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ అంతటా అన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించింది. నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Hyderabad Air Quality Index) 180 స్థాయిలో ఉంది. గాలి నాణ్యత తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి.

పెరుగుతున్న నగర విస్తరీకరణ, వాహనాల రాకపోకలు, విస్తరిస్తున్న పారిశ్రామికవాడలు, హైదరాబాద్‌లో కాలుష్యం పెరగడానికి దోహదం చేస్తున్నాయి. అయితే, ప్రస్తుత HAQI (Hyderabad Air Quality Index) పెరుగుదలకు నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గడం కారణమని చెప్పవచ్చు. రాత్రి ఉష్ణోగ్రత తగ్గడంతో AQI స్థాయిలు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత్తలో మార్పులు, వాహనాల నుంచి వెలువడే పొగ కూడా గాలి నాణ్యతపై ప్రభావం చూపుతోంది. ఉదయం, రాత్రి సమయాల్లో గాలి నాణ్యత పడిపోతోంది.

వింటర్ సీజన్ కారణంగా హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ప్రస్తుతం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 13.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తిరుమలగిరి, చార్మినార్, ఆసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్, బండ్లగూడ, నాంపల్లి, ముషీరాబాద్‌లో 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలో గాలి నాణ్యత దెబ్బతినడంతో వివిధ పనుల మీద బయటకు వెళ్లే చాలామంది మాస్కులు పెట్టుకుంటున్నారు.

Read Also: సచివాలయానికి సందర్శకులు కరువు

Follow Us On : X(Tiwtter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>