epaper
Monday, March 2, 2026
epaper

సచివాలయానికి సందర్శకులు కరువు

కలం డెస్క్ : గ్లోబల్ సమ్మిట్ (Global Summit)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. యావత్తు దేశమంతా దీని గురించి గొప్పగా చెప్పుకునేలా సక్సెస్ చేయాలనుకుంటున్నది. ఇన్వెస్టర్లు, విదేశీ కంపెనీల ప్రతినిధులు నభూతో.. అని అనుకునేలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నది. మంత్రులు, అధికారులు పది రోజులుగా ఏర్పాట్ల పర్యవేక్షణలో తలమునకలయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revant Reddy) సైతం వారం రోజులుగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఏ చిన్న లోపమూ రాకుండా స్వయంగా అక్కడకు వెళ్ళి పరిశీలిస్తున్నారు. తగిన సూచనలు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ ముఖ్యమంత్రి మొదలు కింది స్థాయి అధికారి వరకు బిగ్ టాస్క్ కావడంతో అందరూ ఆ పనుల్లోనే నిమగ్నమయ్యారు. సచివాలయం ముఖం చూసేవారు కరువయ్యారు.

బోసిపోయిన సచివాలయం :

మంత్రులు, అధికారులు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో ఫ్యూచర్ సిటీ (Future City) ప్రాంతంలోనే ఉండిపోవడంతో వారు సచివాలయానికి (Telangana Secretariat) రావడం సాధ్యం కావడంలేదు. దీంతో పనులు కావనే అంచనాతో సందర్శకులు సైతం సచివాలయానికి రావడం మానేశారు. ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉండే ప్రజాప్రతినిధులు రకరకాల అవసరాల కోసం మంత్రులు, అధికారులను కలిసి చెప్పుకునేందుకు సచివాలయానికి వస్తూ ఉంటారు. కిటకిటలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు స్థానిక సంస్థలు (Local Body Elections) ఎన్నికలు జరుగుతుండడంతో ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇంకోవైపు ప్రజలు సైతం ఆ హడావిడిలో మునిగిపోయారు. ఇప్పుడు సందర్శకుల సంఖ్య వందల్లోకి పడిపోయింది. స్థానిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే మళ్ళీ సందడి మొదలుకానున్నది.

Read Also: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!