కలం, వెబ్ డెస్క్: జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్(Nitin Nabin) సైతం నామినేషన్ పత్రాలు సమర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ఎన్డీఏ కూటమి సభ్యుల సమక్షంలో వీళ్లు నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రెటరీ ఖ్యాతి సింగ్‌కు అందజేశారు. అంతకుముందు, ఈరోజు ఉదయం తాను రాజ్యసభకు వెళుతున్నట్లు నితీశ్ కమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిహార్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న నితీశ్ త్వరలోనే ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన స్థానంలో బీజేపీకి బిహార్ సీఎం పీఠం దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే, నితీశ్ కుమారుడు తనయుడు నిశాంత్ కుమార్‌ను డిప్యూటీ సీఎం చేస్తారని వినిపిస్తోంది.

