Bihar Results | బీహార్‌లో మరోసారి ఎన్‌డీఏ జెండా ఎగరే వాతావరణం కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఎన్‌డీఏ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎన్‌డీఏ(NDA) 174, ఎంజీబీ 66, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటే మరోవైపు అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టర్ల వార్ నడుస్తోంది. తమ అభ్యర్థి గెలుస్తారంటే తమ అభ్యర్థి గెలుస్తారంటూ రెండు వర్గాల వారు పోటాపోటీగా పోస్టర్లు వేస్తున్నారు.
Bihar Results | సీఎం నీతీశ్ కుమార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్నట్లుగా ఆయన మద్దతుదారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్‌లు ఏర్పాటుచేశారు. దీనికి కౌంటర్‌గా ప్రతిపక్షాలు పట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయం ముందు నీతీశ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించింది. ఆయనకు వీడ్కోలు పలుకుతున్నట్లుగా వాటిపై రాసి ఉన్నాయి. దీంతో బీహార్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో రాష్ట్రమంతా ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.
Read Also: పది మందిలో మాట్లాడలేకపోతున్నారా..? ఇదే కారణం కావొచ్చు..!
Follow Us on: Instagram

