ఏపీలోని విశాఖపట్నంలో శుక్రవారం ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు(CII Partnership Summit) ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు. దేశవిదేశాల పరిశ్రమల ప్రతినిధులు, సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.
దేశం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదుగుతోందని, రాష్ట్రానికి అనేక పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మౌలిక వసతులు, పరిశ్రమల విస్తరణలో వేగంగా ముందుకు సాగుతోందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలక పాత్ర పోషించనున్నదని, ఇది పరిశ్రమలు, టూరిజం, లాజిస్టిక్స్ రంగాలకు పెద్ద ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సదస్సుతో రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం మరింతగా పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. విశాఖలో జరుగుతున్న ఈ సమ్మిట్(CII Partnership Summit) ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Read Also: భారీ మెజార్టీలో ఎన్‌డీఏ..
Follow Us on: Youtube

