బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలో మొది నుంచి ఎన్‌డీఏ ఆధక్యం కనబరుస్తోంది. 243 స్థానాల్లో 164 స్థానాల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. వీటిలో ఎన్‌డీఏ(NDA) 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాగఠ్‌బంధన్ 6 స్థానాల్లో ముందంలో ఉండగా. జేఎస్‌పీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యారు. ప్రాథమిక ఆధిక్యం చూస్తే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యం నిజమయ్యేలా ఉంది. కాగా ఎన్నికల ప్రక్రియలో ఆరంభంలోనే ఏం చెప్పలేమని, సగం కౌంటింగ్ అయ్యాక కూడా అంతా మారిపోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గెలుస్తుంది మేమే: తేజస్వీ
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది మేమే అని ఆర్‌జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) ధీమా వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభంలో ఆధిక్యంలో ఉంటే గెలిచేసినట్లు కాదని, గెలిచేది తామే అని ఆయన అన్నారు. ‘‘మేమే గెలుస్తున్నాం. అందరికీ ధన్యావాదాలు. మార్పు రానుంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: ఉపఎన్నిక అభ్యర్థి మృతి..
Follow Us on : Pinterest

