కలం, వెబ్ డెస్క్: ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ (Arijit Singh) ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి సంగీతాభిమానులను షాక్‌కు గురిచేశాడు. ఎన్నో సూపర్ హిట్ పాటలతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన అర్జిత్ నిర్ణయం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితం కూడా చర్చకు వచ్చింది. అర్జిత్ సింగ్ వ్యతిగత విషయాలు చాలామందికి దాదాపుగా తెలియవు. ఈ స్వర మాంత్రికుడి వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అర్జిత్ తొలిసారిగా రూప్రేఖా బెనర్జీను వివాహం చేసుకున్నారు. 2013లో పెళ్లి జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అదే సంవత్సరంలో ఈ వివాహ బంధం ముగిసింది.
తర్వాత 2014 జనవరిలో అర్జిత్ సింగ్ తన చిన్ననాటి స్నేహితురాలు, ముర్షిదాబాద్‌కు చెందిన కోయెల్ రాయ్‌ను వివాహం (Marriage) చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో గోప్యంగా వివాహం జరిగింది. అర్జిత్, కోయెల్ ఇద్దరూ గతంలో విడాకులు పొందినవారే. ప్రస్తుతం ఈ దంపతులు ముగ్గురు పిల్లలను పెంచుతున్నారు. ఇందులో ఇద్దరు కుమారులు అర్జిత్–కోయెల్‌కు చెందినవారు.
అర్జిత్ సింగ్ సంగీతాన్ని ఎంతగా ప్రేమించాడో.. అంతకుమించి మొదటి ప్రేయసి రూప్రేఖా బెనర్జీని ఆదరించాడు. ఎంతో ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఏడాదికే విడిపోవడం అర్జిత్‌ను తీవ్రంగా కలిచివేసింది. అందుకే అర్జిత్ ప్రేమ పాటల్లో ఓ ఎమోషన్ ఉంటుంది. లోతైన భావాలుంటాయి. ఈ కారణంగానే అర్జిత్ లవ్ సాంగ్స్‌కు యూత్‌లో క్రేజ్ ఉంది. చిన్న వయస్సులో ఎంతో స్టార్‌డం సంపాదించిన అర్జిత్ (Arijit Singh) మనసుకు నచ్చిన ప్రేయసితో మాత్రం జీవితం పంచుకోలేకపోయాడు.


