కొండగట్టు ఆలయ అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ఇబ్బందులు పట్టవు కానీ.. ఆదాయంపై దృష్టి పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలో ఆర్జిత సేవా రుసుంను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో బండి సంజయ్.. దేవాదాయ అధికారులతో మాట్లాడారు. ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా లేవని, తద్వారా భక్తులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది అధికారులకు పట్టదా అని ప్రశ్నించారు. పైగా ఇప్పుడు రుసుం పెంచడం ఏంటని మండిపడ్డారు.
‘‘కొండగట్టు అంచన్న ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటప్పుడు భక్తులకు ఇక్కట్లు తగ్గించడానికి, మెరుగైన సౌకర్యాలు అందించడం మానుకుని రుసుంలు పెంచుతారా? అదేంపద్దతి?’’ అని అన్నారు. వెంటనే ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని, భక్తుల సమస్యలను పరిష్కరించాలని Bandi Sanjay కోరారు.
Read Also: ‘నన్ను దేశంలో సగం మంది చంపేయాలనుకున్నారు..’
Follow Us on: Instagram

