epaper
Monday, January 26, 2026
spot_img
epaper

మూడు ప్రాణాలను కాపాడిన చిన్నారి ఫోన్​ కాల్

కలం, వెబ్​డెస్క్​: ఓ చిన్నారి ఫోన్​ కాల్ మూడు ప్రాణాలను కాపాడింది. ఆపద సమయంలో సమయస్ఫూర్తితో ఆ చిన్నారి వ్యవహరించిన తీరు తనతోపాటు మరో ఇద్దరిని చావు నుంచి బయటపడేసింది. ఈ ఘటన అమెరికాలోని జార్జియా రాష్ట్రం లారెన్స్​విలే సిటీలో జరిగింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ భారతీయ కుటుంబంలో జరిగిన గొడవ (Family Shooting in US) ఐదుగురిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్​ కుమార్​(51), మీను డోగ్రా (43) దంపతులకు ముగ్గురు పిల్లలు. వీళ్ల ఇంటికి బంధువులు గౌరవ్​ కుమార్​(33), నిధి చందర్(37)​, హరీష్​ చందర్​(38) వచ్చారు.

అనంతరం ఏదో విషయమై గొడవ జరగడంతో కుమార్​ తన తుపాకీతో కాల్పులు జరిపాడు (Family Shooting in US). దీంతో గౌరవ్​, నిధి, హరీష్​, మీను అక్కడికక్కడే చనిపోయారు. కాల్పుల విషయం తెలిసి స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి విజయ్​ కుమార్​ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తమకు కాల్​ చేసింది నిందితుని పిల్లల్లో ఒకరని పోలీసులు వెల్లడించారు. తాము సమయానికి రాకపోతే నిందితుడు వాళ్లను కూడా బలి తీసుకునేవాడని చెప్పారు. కాగా, కాల్పుల శబ్దం విని మేల్కొన్న చిన్నారులు, వెంటనే భయంతో అండర్​ గ్రౌండ్​లోని ఇంట్లో దాక్కున్నారు. అక్కడి నుంచే ఓ చిన్నారి 911 నెంబర్​ ద్వారా పోలీసులకు కాల్​ చేయడంతో, పోలీసులు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో పిల్లల ప్రాణాలు నిలిచాయి. వాళ్లను బంధువు ఒకరు తన ఇంటికి తీసుకెళ్లారు. కాగా, ఈ దుర్ఘటనపై విచారం తెలుపుతూ, చిన్నారులకు అండగా ఉంటామని అమెరికాలోని భారత ఎంబసీ ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>