epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వచ్చే నెలలో పెళ్లి.. అమెరికా చెరలో నేవీ ఆఫీసర్ బందీ

కలం, వెబ్​డెస్క్​: అమెరికా చెరలో భారత నేవీ ఆఫీసర్​​ (Indian Navy Officer) ఒకరు చిక్కారు. గత వారం అట్లాంటిక్​ సముద్రంలో వెనెజువెలా నుంచి రష్యాకు వెళుతున్న మారినెరా నౌకను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, ముగ్గురు భారత్​కు చెందినవాళ్లు. వీళ్లలో ఒకరు కేరళ, మరొకరు గోవా, ఇంకొకరు హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన వాళ్లని రష్యా వెల్లడించింది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో విషయం బయటపడింది. అమెరికా బందీల్లో ఒకరైన హిమాచల్​ ప్రదేశ్​లోని కాంగ్రా జిల్లాకు చెందిన నేవీ ఆఫీసర్ రక్షిత్​ చౌహాన్ (Rakshit Chauhan) ​కు వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో రక్షిత్​ బందీ అయ్యాడని తెలిసి అతని కుటుంబం తల్లడిల్లిపోతోంది.

‘రక్షిత్​.. రష్యా మర్చంట్ నేవీలో నిరుడు ఆగస్ట్​ 11న నేవీ ఆఫీసర్​గా చేరాడు. మొదటి అసైన్​మెంట్​గా వెనెజువెలాకు పంచినట్లు ఫోన్​లో మాట్లాడినప్పుడు చెప్పాడు. చివరి సారి జనవరి 7న రక్షిత్​తో మాట్లాడాం.. అంతే. ఆ తర్వాత మా కుమారుడు అమెరికా చేతిలో బందీ అయినట్లు తెలిసింది. ఫిబ్రవరి 19న రక్షిత్​కు (Rakshit Chauhan) పెళ్లి చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు ఇలా అమెరికా చెరలో ఉన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని మా వాడిని విడిపించాలి’ అని రక్షత్​ అమ్మ రీటా దేవి, తండ్రి రంజిత్​ సింగ్​ చౌహాన్​ వేడుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు తమ కుమారుడి గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదని చెబుతున్నారు. పాలంపూర్​ ఎమ్మెల్యే ఆశిష్​ భుతాలియా దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని అంటున్నారు.

Read Also: కట్టుబాట్లను ధిక్కరించి.. ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>