కలం, వెబ్ డెస్క్ : కొన్ని రోజులుగా స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Price).. నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద రూ.1,690 పెరిగి రూ.1,42,150కి చేరుకుంది. ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,550 పెరిగి రూ.1,30,300కి చేరుకుంది. ఇక 18క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే రూ.860 పెరిగి రూ.1,06,610కి చేరుకుంది. గత నాలుగు రోజులుగా చూస్తే బంగారం ధరలు తులం మీద రూ.4వేలకు పైగా పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఇంకా పెరుగుతున్నాయి.
వెండి ధరలు (Silver Prices) కూడా నేడు బాగానే పెరిగాయి. కిలో వెండి ధర మీద ఏకంగా రూ.12వేల దాకా పెరిగింది. నేడు కిలో వెండి రూ.2,87,000కి చేరింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఇంకా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ (Trump Tariffs) ల బెదిరింపులు, ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, ఇరాన్ లో ఆర్థిక సంక్షోభం లాంటివి ప్రపంచ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. నేడు స్టాక్ మార్కెట్లు కొంత మేర లాభపడి ముగిశాయి. ఈ రోజు కూడా బంగారంపై పెట్టుబడులు భారీగానే వచ్చాయి. సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ విభాగంలో గోల్డ్ ను ఎక్కువ మంది ఎంచుకోవడం వల్లే ధరలు ఇంకా పెరుగుతున్నాయని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక రకంగా షాకింగ్ అనే చెప్పాలి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే పెళ్లిళ్ల సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది కాబట్టి బంగారం ధరలు (Gold Price) మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: వచ్చే నెలలో పెళ్లి.. అమెరికా చెరలో నేవీ ఆఫీసర్ బందీ
Follow Us On: Sharechat


