తెలంగాణ పోలీసు యంత్రాంగంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఏం పీకుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే నూతన డీజీపీ శివధర్ రెడ్డిపై విమర్శలు చేశారు. తమకు పింక్ బుక్, రెడ్ బుక్, బ్లూక్ తెలియదని, తమది కేవలం ఖాకీ బుక్ అని చెప్పిన శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా? అంటూ ఎద్దేవా చేశారు.
‘‘రేవంత్ రెడ్డి తుపాకీ ఇస్తే, రోహిన్ రెడ్డి ఆ తుపాకీతో బెదిరించాడు అని స్వయంగా మంత్రి కొండా సురేఖ కూతురు చెప్పింది. కానీ, పోలీసోళ్లు ఏమో తుపాకీ ఇచ్చింది కొండా మురళీ, బెదిరించింది సుమంత్ అని చెప్తున్నారు. బెదిరించిన మాట వాస్తవమే కదా, నిందితుడిని మంత్రి పోలీసుల ముందే తీసుకుపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల దమ్ము, దైర్యం, తెలివి తేటలు ఎక్కడ పోయినాయి?’’ అని ప్రశ్నలు గుప్పించారు కేటీఆర్(KTR).
Read Also: ఐఏఎస్‌లకు కేటీఆర్ రిక్వెస్ట్..

