లోకేష్ కనగరాజన్(Lokesh Kanagaraj).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బ్లాక్ బస్టర్ మూవీస్ తీయడంలో దిట్ట అన్న పేరు తెచ్చుకున్నాడు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘నగరం’ మూవీతో తమిళ మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్‌లతో పాన్ ఇండియా లెవెల్లో తన మార్క్ చూపించుకున్నాడు. అయితే ఇప్పుడు అతడు డైరెక్టర్‌గా కాకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అతి త్వరలోనే ఈప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
లోకేష్ హీరోగా వచ్చే మూవీని ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ సినిమా తెరకెక్కించిన అరుణ్ మాతేశ్వరన్(Arun Matheswaran) డైరెక్ట్ చేయనున్నడు. కొన్ని నెలలుగా ఈ మూవీ స్క్రిప్ట్ పనిలో అరుణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల స్క్రిప్ట్‌ను లాక్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయింది. ఈ మూవీని సన్ పిచర్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకున్నాయి. మరి డైరెక్టర్‌గా ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న లోకేష్(Lokesh Kanagaraj).. హీరోగా ఎలా రాణిస్తాడో కూడాలి.
Read Also: మరోసారి గుడ్ న్యూస్ చెప్పి చెర్రి దంపతులు

