హైదరాబాద్ యూత్ కరేజీ నేత సల్మాన్ ఖాన్(Salman Khan).. గురువారం కేటీఆర్(KTR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో ముస్లింలను రాజకీయంగా తొక్కేయాలని కుట్ర జరుగుతోందన్నారు. ‘‘2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క మైనారిటీ నాయకుడికి కూడా పదవులు ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నేను చెప్పగానే, మంత్రులంతా నీకేం కావాలో చెప్పు అని మంతనాలు చేశారు. సెక్యులరిజాన్ని బ్రతికించే బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.
Read Also: ‘నువ్వేం సీఎంవి రేవంత్’.. కేటీఆర్ విమర్శనాస్త్రాలు

