కలం, వెబ్ డెస్క్: జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సరికొత్త రికార్డును నెలకొల్పింది. NHAI, మెస్సర్స్ రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం 24 గంటల్లో 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను వేసి 28.95 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించింది. బెంగళూరు-కడప-విజయవాడ కారిడార్ నిర్మాణ పనుల్లో భాగంగా అద్భుత ఘనతను సాధించింది. ఈ రికార్డుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ (Pawan Kalyan) ట్వీట్ చేశారు. వేగం, నాణ్యత, నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందన్నారు.
ఈ విజయం దేశ మౌలిక సదుపాయాల బలానికి, ఆంధ్రప్రదేశ్ కార్యాచరణ, సామర్థ్యానికి బలమైన ప్రతీకగా నిలుస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని మార్చడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతుందని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర మంత్రి గడ్కరీకి పవన్ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ : పొంగులేటి
Follow Us On : WhatsApp


