epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సరికొత్త రికార్డ్​.. 24 గంటల్లో 28.95 కి.మీ రోడ్డు నిర్మాణం, పవన్​ హర్షం​

కలం, వెబ్​ డెస్క్​: జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) సరికొత్త రికార్డును నెలకొల్పింది. NHAI, మెస్సర్స్ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం 24 గంటల్లో 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను వేసి 28.95 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించింది. బెంగళూరు-కడప-విజయవాడ కారిడార్ నిర్మాణ పనుల్లో భాగంగా అద్భుత ఘనతను సాధించింది. ఈ రికార్డుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ (Pawan Kalyan)​ ట్వీట్​ చేశారు. వేగం, నాణ్యత, నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందన్నారు.

ఈ విజయం దేశ మౌలిక సదుపాయాల బలానికి, ఆంధ్రప్రదేశ్ కార్యాచరణ, సామర్థ్యానికి బలమైన ప్రతీకగా నిలుస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని మార్చడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతుందని పవన్​ కళ్యాణ్​ (Pawan Kalyan) అన్నారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర మంత్రి గడ్కరీకి పవన్​ ధన్యవాదాలు తెలిపారు.

Read Also: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ : పొంగులేటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>