epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వర్సిటీల భూముల్ని అమ్ముకోవడం సిగ్గుచేటు: బండి సంజయ్​

కలం, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో వర్సిటీలు, విద్యాలయాల భూముల్ని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)​ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉద్ధేశించిన భూములను అమ్ముకోవడం తగదన్నారు. హైదరాబాద్​లోని మౌలానా ఆజాద్​ నేషనల్​ ఉర్దూ యూనివర్సిటీ (Maulana Azad National Urdu University) భూముల వినియోగంపై వర్సిటీకి నోటీసులు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తూ బుధవారం ‘ఎక్స్’ వేదికగా బండి సంజయ్​ స్పందించారు. విద్యాలయాల భూముల జోలికి రావడం ప్రభుత్వానికి రెడ్​ లైన్​ లాంటిదని, వెనక్కి తగ్గకపోతే విద్యార్థులతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతానని హెచ్చరించారు. ‘ నేషనల్​ ఉర్దూ యూనివర్సిటీ భూముల వినియోగంపై ఆ వర్సిటీకి నోటీసులు పంపడం ఏంటి? వేల కోట్ల విలువైన ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి, అమ్ముకోవడానికి ఇది మొదటి అడుగు కాదా? చదువుకు కనీస ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. విద్య కోసం గతంలో చేసిన భూ కేటాయింపులను ప్రశ్నిస్తోందా?’ అని ఆయన అన్నారు.

ఒవైసీ మీద చర్యలేవీ?

రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకొని ప్రజాప్రయోజనాలకు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రభుత్వాన్ని బండి సంజయ్​ (Bandi Sanjay) ప్రశ్నించారు. హైదరాబాద్​ ఓల్డ్​ సిటీలో సలకం చెరువును ఆక్రమించి, విద్యను వ్యాపారంగా మార్చిన ఒవైసీ మీద చర్యలెందుకు లేవు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను స్వాధీనం చేసుకునే ఏ నిర్ణయాన్ని అయినా ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. అలా చేయకపోతే, విద్యార్థులతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also: సిరిసిల్లలో గులాబీకి గుబులు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>