కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ విద్యార్థులను పోలీసులతో గొంతునులిమి, దాడి చేసినప్పుడు రాహుల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
లగచర్ల(Lagacherla)లో వారి భూముల కోసం పోరాడుతున్న మహిళలను కొట్టి, దుస్తులు చింపి అవమానించినప్పుడు చలనం కలగలేదా అని కేటీఆర్ నిలదీశారు. హైడ్రా (Hydraa) బుల్డోజర్లతో ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు ఢిల్లీలో నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల విధ్వంసం, కేబీఆర్ పార్కును నాశనం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదన్నారు. రాజ్యాంగ ప్రక్రియను అపహాస్యం చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు. అసెంబ్లీ ఎదుటే మహిళా ప్రజాప్రతినిధులు చీరలు లాగి, దాడులు చేసినప్పుడు రాహుల్ గాంధీ ఒక్క మాటైనా మాట్లాడలేదని కేటీఆర్ (KTR) గుర్తు చేశారు.
రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, జర్నలిస్టుల అరెస్టులు, భూకబ్జాలపై మాట్లాడడానికి సమయం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగంగా అవినీతి గురించి మాట్లాడినా నోరు మెదపలేదని రాహుల్ పై ధ్వజమెత్తారు. అవసరమైనప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు ప్రచార ఆర్భాటం కోసం వచ్చారా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఈ ప్రచార పర్యటనలు చేయడానికి రాహుల్ గాంధీకి అధికారం ఎవరు ఇచ్చారు అని సూటిగా ప్రశ్నించారు.
Also Read : సజ్జనార్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడు: మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

