కలం, వెబ్ డెస్క్: ఏపీలో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) నిర్వహణకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 15 నుంచి 17 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన , 19వరకు నామినేషన్లపై అపీల్ కు అవకాశం ఉండగా 20న అప్పీళ్ల పరిష్కారం చేయనుంది. 21న నామినేషన్ల ఉపసంహరణ అదే రోజు అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను విడుదల చేయనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది.
26న పంచాయతీ ఎన్నికల నిర్వహించడంతో పాటు అదే రోజు ఫలితాల ప్రకటన ఉండనుంది. అవసరమైన చోట్ల మరుసటి రోజు (27వ తేదీ) రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కమిషనర్ పునేఠా వివరించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికల నిర్వహణలకు ఎస్ఈసీ ప్రణాళిక సిద్ధం చేయగా తొలి విడతకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏకగ్రీవ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు
ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. జనాభా ఆధారంగా ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల నజరానా ఇవ్వనుంది.

