కలం, వెబ్ డెస్క్ : సూరత్‌కు చెందిన ఒక కుటుంబం రైలు ప్రయాణాన్ని తమ వంటగదిగా మార్చుకుంది. 3AC రైలు కోచ్‌లో మిడిల్ బెర్త్‌పై కూర్చుని ఏకంగా వంట చేయడం ప్రారంభించడంతో (Cooks Food Inside Train) తోటి ప్రయాణికులు విస్తుపోయారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళ మాట్లాడుతూ, “అయ్యో! ఎలక్ట్రిక్ టోస్టర్ తీసుకురావడం మర్చిపోయాం.. అది ఉంటే శాండ్విచ్లు కూడా తయారు చేసుకునేవాళ్లం” అంటూ క్యాజువల్‌గా వ్యాఖ్యానించడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. రైళ్లలో ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై పట్ల నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

