కలం, వెబ్ డెస్క్: ఏపీ స్థానిక ఎన్నికల అక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారని వైఎస్ జగన్ (YS Jagan) విమర్శించారు. తాడేపల్లిలోని పార్టి కార్యాలయంలో ఆయనతో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికలు జరిగిన తీరుపై నేతలతో చర్చించారు. ఎన్నికల్లో వైసీపీ క్యాడర్ కసిగా పోరాడిందని జగన్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమాలకు పాల్పడినా.. 2024 ఎన్నికలతో పోలిస్తే పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. సజావుగా ఎన్నికలు నిర్వహించి ఉంటే వైసీపీ అనుకూలంగా ఇంకా ఓటిం శాతం పెరిగేదని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా అవన్నీ దాటుకుని విజయాలు సాధించిన చోట కూడా ఫలితాలు తారుమారు చేశారని జగన్ ఆరోపించారు. లెక్కింపు కేంద్రాల్లో కరెంట్ నిలిపి వేసి మరి అక్రమాలకు పాల్పడ్డారని.. అలాంటి చంద్రబాబు తమకు నీతులు చెబుతున్నారని ఆయన (YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు.

