1968లో రాజీవ్‌తో పెళ్లి.. పౌరసత్వంపై 15 ఏళ్ల నిరీక్షణ ఎందుకు? : కంగనా

కలం, వెబ్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ భారత పౌరసత్వం (Indian Citizenship) స్వీకరించిన సమయంపై బీజేపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) పలు ప్రశ్నలు లేవనెత్తారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని 1968లో వివాహం చేసుకున్న సోనియా.. భారత పౌరసత్వం పొందడానికి 1983 వరకు ఎందుకు ఎదురుచూశారని ఆమె ప్రశ్నించారు. సోనియా ఇటీవల విడుదల చేసిన ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ అనే జ్ఞాపకాల పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజీవ్‌ గాంధీతో వివాహం జరిగిన తర్వాత సుమారు 15 ఏళ్లకు సోనియా (Sonia Gandhi) భారత పౌరసత్వం తీసుకున్నారని కంగనా పేర్కొన్నారు. 1980లో సంజయ్‌ గాంధీ మరణించిన మూడేళ్ల తర్వాతే పౌరసత్వం స్వీకరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారు. ఇదే అంశంపై నవంబర్‌ 10న కూడా కంగనా వరుస పోస్టులు పెట్టారు. తన ‘ఎమర్జెన్సీ’ సినిమా కోసం గాంధీ కుటుంబ రాజకీయ చరిత్రపై లోతుగా పరిశోధన చేసినట్లు వెల్లడించారు.

ఇందిరా గాంధీ, సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీల మరణాల పరిణామాలను ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనల వెనుక యాదృచ్ఛికంగా కనిపించే అంశాలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే సంజయ్‌ గాంధీ మరణం తర్వాత ఆయన భార్య మేనకా గాంధీని కుమారుడితో కలిసి ఇంటి నుంచి పంపించారని ఆరోపించారు. రాజీవ్‌, సోనియాల పరిచయం, గాంధీ కుటుంబంలో సోనియా ఎదుగుదలపై కూడా తన పోస్టుల్లో ప్రస్తావించారు. మేనకా గాంధీకి సంబంధించిన ఓ వీడియో తనను కలచివేసిందని పేర్కొన్నారు. కంగనా (Kangana Ranaut) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

Also Read : హై అలర్ట్​.. ఎయిర్​ ఇండియా ఫ్లైట్​ కు హైజాక్​ వార్నింగ్​!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>