సన్నిహితుల సమక్షంలో నటి ప్రియా భవానీ శంకర్ వివాహం

కలం, వెబ్ డెస్క్​: నటి ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు రాజ్‌ను బుధవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రియా, రాజ్‌ కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులని, గత పదేళ్లుగా ప్రేమలో ఉన్నారని సమాచారం.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రియా భవానీ శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’లోనూ కీలక పాత్ర పోషించారు. సంతోష్ శోభన్ సరసన ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘దూత’ వెబ్ సిరీస్‌తోనూ ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>