ఏంటీ విచిత్రం.. రైలు బోగీని వంగటది చేసేశారు!

కలం, వెబ్ డెస్క్ : సూరత్‌కు చెందిన ఒక కుటుంబం రైలు ప్రయాణాన్ని తమ వంటగదిగా మార్చుకుంది. 3AC రైలు కోచ్‌లో మిడిల్ బెర్త్‌పై కూర్చుని ఏకంగా వంట చేయడం ప్రారంభించడంతో (Cooks Food Inside Train) తోటి ప్రయాణికులు విస్తుపోయారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళ మాట్లాడుతూ, “అయ్యో! ఎలక్ట్రిక్ టోస్టర్ తీసుకురావడం మర్చిపోయాం.. అది ఉంటే శాండ్‌విచ్‌లు కూడా తయారు చేసుకునేవాళ్లం” అంటూ క్యాజువల్‌గా వ్యాఖ్యానించడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. రైళ్లలో ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై పట్ల నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>