బీఆర్ఎస్‌లో చేరిన యువ వ్యాపారవేత్త నల్ల వినయ్‌రెడ్డి

కలం, నిర్మల్: లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన యువ వ్యాపారవేత్త నల్ల వినయ్‌ రెడ్డి (Nalla Vinay Reddy) బీఆర్ఎస్‌లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాసంలో ఆయన గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.

యువత బీఆర్ఎస్‌లో చేరడం శుభసూచకమని కేటీఆర్ అన్నారు. ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో యువగర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జిలు రాంకిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మాజీ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>