కలం, వెబ్ డెస్క్ : దీపావళి పండుగ వేళ జైపూర్‌లో ఒక ప్రత్యేకమైన తీపి పదార్థం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ‘త్యోహార్ అష్రఫీ’ (Tyohar Asharfi) పేరుతో రూపొందించిన ఈ స్వీట్, దాని ధర, ప్రజెంటేషన్‌తో వార్తల్లో నిలిచింది. కేవలం 9 గ్రాముల బరువుండే ఈ ఒక్క స్వీట్ ముక్క ధర రూ.1,111 కాగా, కిలో లెక్కన చూస్తే రూ.1.23 లక్షల వరకు ఉంటుంది.
పూర్వకాలంలో రాజులు, మహారాజుల కాలంలో అష్రఫీలు అని పిలిచే బంగారు నాణేలను బహుమతులుగా ఇచ్చే ఆచారానికి ప్రతీకగా ఈ తీపి నాణేన్ని తయారు చేసినట్లు ఈ స్వీట్ షాప్ వ్యవస్థాపకురాలు అంజలీ జైన్ తెలిపారు. శుభసూచకంగా భావించే 1,111 రూపాయల ధరకు ఒక ముక్క చొప్పున, తొమ్మిది స్వీట్లు ఉన్న ప్రత్యేక బాక్స్‌ను రూ.9,999 కి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పండుగ వేళ ఈ స్వీట్ (Tyohar Asharfi) జైపూర్‌లో విశేషంగా అమ్ముడవుతోంది.
Also Read : పోలీసులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: X(Twitter)

