నాణ్యతతో వివో భవన నిర్మాణం పూర్తిచేయాలి: ఎంపీడీవో

కలం, సోన్: సోన్ మండలం న్యూబొప్పారం (New Bopparam) గ్రామంలో మహిళా సమాఖ్య (వీఓ) భవన (VO Building) నిర్మాణ పనులను ఎంపీడీవో కట్కం రామకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేశెట్టి నరేష్‌తో మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిషన్ భగీరథ పైపులైన్‌లో లీకేజీలు లేకుండా చూసుకోవడంతో పాటు తాగునీటిని వృథా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>