కలం, వనపర్తి : జిల్లా జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ప్రెస్ క్లబ్ (Press Club) నిర్మాణానికి అడుగులు పడుతున్న నేపథ్యంలో వనపర్తి (Wanaparthy) ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 6న జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరూ (Journalists) హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
ప్రెస్ క్లబ్ భూమిపూజ నిర్వహణ, భవన నిర్మాణ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలు, జర్నలిస్టుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను స్వీకరించి అందరి భాగస్వామ్యంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రెస్ క్లబ్ ఏ ఒక్క సంఘానికో, వ్యక్తికో పరిమితం కాకుండా జిల్లా జర్నలిస్టులందరి ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలవాలన్నదే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. విభేదాలకు తావులేకుండా అన్ని సంఘాలు, జర్నలిస్టులు ఒకే వేదికపైకి వచ్చి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
సమావేశ వివరాలు:
ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు వనపర్తిలోని నంది హిల్స్ ఎం.వై.ఎస్. మినీ ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించనున్నారు. జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కోరారు.

