తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం తథ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఎవరి బెండు తీయాలి, ఎవరెవరి సంగతి చూడాలో చూస్తానని అన్నారు. అందరి సంగతి తనకు తెలుసని, అన్నీ బయటకు వస్తాయని అన్నారు. శనివారం రోజున కాంగ్రెస్, బీజేపీ మరోసారి బీసీలను మోసం చేశాయన్నారు. బీసీ బంద్(BC Bandh) అంటే అంతా కలిసి మద్దతు చెప్పామని, కాంగ్రెసోళ్లు, బీజేపీ వాళ్లు పోయి ధర్నా చేశారని గుర్తు చేశారు. వాళ్లు ధర్నా చేసుడు.. అందరూ శ్రీవైష్ణవులు అంట కానీ రొయ్యల బుట్ట మాయంమైందంట అన్నట్లు ఉందని చురకలంటించారు. ఈ ప్రభుత్వంలో సొంత పార్టీ మంత్రులు కూడా సంతోషంగా లేరని అన్నారు. పోయిన దీపావళికి పేల్తాయని బాంబులేటి చెప్పిన బాంబులు ఈ ఏడాది వాళ్ల ఇంట్లోనే పేళాయంటూ ఎద్దేవా చేశారు.
Read Also: ఆ బాధ్యత రేవంత్‌దే: సబిత ఇంద్రారెడ్డి

