కొండా సురేఖ ఎపిసోడ్‌పై మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కొండా సురేఖ(Konda Surekha) కుమార్తె సుశ్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు. రేవంత్‌పై సిట్టింగ్ మంత్రి కూతురే సంచలన ఆరోపనలు చేశారని, వాటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్‌కు ఉందని అన్ని అన్నారు. ఈ సెటిల్‌మెంట్‌లో రేవంత్(Revanth Reddy)కు అత్యంత సన్నిహితుడు కూర్చున్నాడని, దానర్థం రేవంత్‌కు కూడా ఇందులో భాగం ఉందని ఆరోపించారు. అంతేకాకుండా అసలు ఏ సిమెంట్ కంపెనీ డైరెక్టర్‌ను బెదిరించారో అతని స్టేట్‌మెంట్‌ను పోలీసులు తీసుకున్నారా? తీసుకుంటే అది ప్రజల ముందు ఉంచాలి అని ఆమె డిమాండ్ చేశారు.

