మద్యం దుకాణాల లైసెన్స్(Liquor Shop Licence) దరఖాస్తుల గడువును ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడమే ఇందుకు కారణం. తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం అబ్కారీ శాఖ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అక్టోబర్ 18తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. తాజాగా ఈ గడువును పొడిగిస్తూ అబ్కారీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా ఈ ఏడాది వీటి సంఖ్య 87 వేల దగ్గర ఆగిపోయింది.
Liquor Shop Licence | ఆఖరి రోజు అంటే అక్టోబర్ 18న సుమారు 40వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి సంఖ్యను మరింత పెంచడం కోసమే అబ్కారీ శాఖ.. దరఖాస్తు గడువును మరింత పొడిగింది. ఈ క్రమంలోనే మొదట అనుకున్న ప్రకారం అక్టోబర్ 23న నిర్వహించాల్సిన లాటరీను 27న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారికి మరింత సమయం దక్కింది. మరి ఈ పొడిగింపు దరఖాస్తుల సంఖ్యను ఎంత వరకు పెంచుతుందో చూడాలి.
Read Also: ఆ బాధ్యత రేవంత్‌దే: సబిత ఇంద్రారెడ్డి

