కలం, వెబ్ డెస్క్: తలనొప్పి (Headache).. సహజంగా బాధించే అనారోగ్య సమస్య. దీనిని చాలామంది లైట్‌గా తీసుకుంటారు. కొందరు మాత్రం కాఫీ తాగడం, ట్యాబ్లెట్ వేసుకోవడం, నిద్రపోవడం లాంటివి చేస్తుంటారు. కానీ అసలు సమస్య ఎక్కడుంది? అని తెలియదు. ఓ రీసెంట్ సర్వే అసలు విషయం ఏమిటో చెప్పింది. అసలు తలనొప్పికి, తలకు సంబంధం లేదని చెప్పింది. తలనొప్పి వెనకున్న అసలు కారణం.. మన మెడ, దాని కండరాలు. ట్రాపిజియస్ కండరాలు భుజం నుంచి మెడ వరకు ప్రభావం చూపి.. నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది.
అమెరికాలో జరిగిన RSNA సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మైగ్రేన్, టెన్షన్, తలనొప్పి సమస్యలకు మెడలోని ట్రాపిజియస్ కండరాల్లో వాపు. నర్వ్ సెన్సిటివిటీ కావచ్చని కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎంఆర్ఐ (MRI) స్కాన్లలో ఈ కండరాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను స్పష్టంగా గుర్తించారు. తలనొప్పి (Headache) తీవ్రత కూడా మార్పులు జరగుతుంటాయి. ఇదే విషయమై ప్రముఖ డాక్టర్ నికో సోల్ల్మన్ కీలక విషయాలను వెల్లడించారు. తలనొప్పిని మెదడు సమస్యగా చూడొద్దన్నారు. తలనొప్పి అంటే నిరంతరం ఆలోచనలు, ఒత్తిడి, మెదడు ప్రభావం అని మాత్రమే భావించాం. వాపు, నర్వ్ సమస్యలు కూడా. ఉపశమన మార్గాల గురించి ఆలోచిస్తే తలనొప్పికి చెక్ పెట్టవచ్చునని తెలిపారు.
Read Also: ఈ ఐదు అలవాట్లతో ఒత్తిడికి గుడ్ బై చెప్పండి..!
Follow Us On: Instagram


