కలం వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది..మణుగూరు నుంచి పాల్వంచ వైపు విద్యార్థులతో వెళ్తున్న కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది విద్యార్థినీ, విద్యార్థులు గాయాలపాలయ్యారు.అటవీ మార్గంలో బాగా మంచు కురవడంతో మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, వాహనదారులు బస్సు అద్దాలు పగులగొట్టి లోపల ఇరుక్కుపోయిన విద్యార్థులను బయటకు తీశారు.అయితే ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం ..ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు ఇతర వాహనాల్లో తరలించారు.సంఘటన స్థలానికి పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేరుకొని సహాయక చర్యలలో పాల్గొన్నారు.అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ‘పాలమూరు’ అవకతవకలపై ‘సిట్’ కాంగ్రెస్ నేతలు, కవిత డిమాండ్
Follow Us On: Pinterest


