కలం, వెబ్ డెస్క్ : వచ్చే రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు భారత సైన్యం వినూత్నంగా సన్నద్ధం అవుతోంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26 నిర్వహించే రిపబ్లిక్ పరేడ్ లో భారత సైన్యానికి చెందిన రిమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (ఆర్ వీసీ) ప్రత్యేకంగా ఎంపిక చేసిన జంతువుల బృందం (Animal Contingent) ను తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ జంతువుల బృందం (Animal Contingent) లో రెండు బాక్ట్రియన్ ఒంటెలు, నాలుగు పోనీలు (పర్వత జాతి గుర్రాలు), నాలుగు డేగలు, పది స్వదేశీ జాతికి చెందిన ఆర్మీ జాగిలాలు, అలాగే ఇప్పటికే సేవల్లో ఉన్న మరో ఆరు శునకాలు ఉన్నాయి. వీటితో భారత ఆర్మీ కవాతు కోసం రిహార్సల్ చేస్తోంది. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యానిమల్ కంటింజెంట్ ప్రత్యేకంగా నిలవనుంది.
Read Also: ఆటో డ్రైవర్ టు ఎయిర్‌లైన్స్ ఓనర్.. ‘శంఖ్ ఎయిర్’ చైర్మన్ ఇన్స్పైరింగ్ జర్నీ
Follow Us On : WhatsApp


