కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విజయ డైరీ పార్లర్‌ను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) సోమవారం ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి మహబూబ్ నగర్ (Mahabubnagar) మండల సమాఖ్య ద్వారా ఈ విజయ డైరీ పార్లర్ (Vijaya Dairy Parlour) ను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విజయ డైరీ (Vijaya Dairy Parlour)కి సంబంధించిన వివిధ పాల ఉత్పత్తులను ఈ పార్లర్‌లో అందుబాటులో ఉంచి విక్రయించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌కు వచ్చే అధికారులు, సిబ్బంది, ప్రజలకు విజయ డైరీ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా పార్లర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, డీఆర్‌డీఓ నరసింహులు, జిల్లా డైరీ శాఖ డి.డి శ్రీనివాస్, మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : కుట్రపూరితంగానే స్పీకర్‌పై దాడి.. వేముల వీరేశం ఫైర్
Follow Us On: X(Twitter)

