అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అన్ని మండలాల ఎంపిడివోలతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. గుర్తించిన లబ్ధిదారుల వివరాలు ఎంపీడీవోల లాగిన్ ల నుంచి పై స్థాయికి వెంట వెంటనే పంపాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లు త్వరిత గతిని పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>