కలం యాదగిరిగుట్ట: పట్టణంలో (Yadagirigutta) సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మార్వో ఆఫీస్ కు ఎదురుగా ద్విచక్ర వాహనంపై రాజపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన కాసు అరవింద్ అతివేగంగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు యువకుడు ఏమ్మార్వో ఆఫీస్ ఎదురుగా యూ టర్న్ చేస్తుండగా పోలీస్ వాహనాన్ని (Road Accident) వెనకాల నుండి ఢీ కొట్టాడు. దీంతో అరవింద్ కు తీవ్ర రక్త స్రావమై గాయలపాయ్యాడు. స్థానికులు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అరవింద్ ను మానవత దృక్పధంతో పోలీసులు హుటాహుటిన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

