విజయ డైరీ పార్లర్‌ను ప్రారంభించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విజయ డైరీ పార్లర్‌ను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) సోమవారం ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి మహబూబ్ నగర్ (Mahabubnagar) మండల సమాఖ్య ద్వారా ఈ విజయ డైరీ పార్లర్‌ (Vijaya Dairy Parlour) ను నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విజయ డైరీకి సంబంధించిన వివిధ పాల ఉత్పత్తులను ఈ పార్లర్‌లో అందుబాటులో ఉంచి విక్రయించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌కు వచ్చే అధికారులు, సిబ్బంది, ప్రజలకు విజయ డైరీ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా పార్లర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, డీఆర్‌డీఓ నరసింహులు, జిల్లా డైరీ శాఖ డి.డి శ్రీనివాస్, మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>