కలం, నకిరేకల్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు దళిత సమాజానికే అవమానమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ( MLA Vemula Veeresham) మండిపడ్డారు. శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వైఖరి పట్ల యావత్ తెలంగాణ సమాజంతో పాటు ముఖ్యంగా దళిత సమాజం తీవ్ర మనస్తాపానికి గురై అసెంబ్లీ వైపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో దళితులకు బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
గతంలో భట్టి.. ఇప్పుడు స్పీకర్..
గతంలో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ ఆయనను అవమానించారని వీరేశం గుర్తుచేశారు. ఇప్పుడు ఒక పథకం ప్రకారమే గౌరవ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి నుంచి తాతా మధు వరకు పలువురు బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌పై చేసిన దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు ఆ పార్టీకి దళితుల పట్ల ఉన్న వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, స్పీకర్ పదవిని అవమానించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని, వారిని దోషులుగా నిలబెట్టాలని వీరేశం (Vemula Veeresham) డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ వాళ్ళు అడ్డంకులు సృష్టిస్తున్నారు..
కేసీఆర్ (KCR) అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా బీఆర్ఎస్ నాయకులు నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారని వీరేశం ఆరోపించారు. రాష్ట్రంలోప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజల ఆస్తులు, భూములు, ఇసుకతో పాటు మనుషుల జీవితాలను కూడా దోచుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
Also Read : దులీప్ ట్రోఫీలో ఇషాన్ హిస్టరీ
Follow Us On: X(Twitter)

