సారంగాపూర్ లో 11మంది డీజే నిర్వాహకుల బైండోవర్

కలం, నిర్మల్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సారంగాపూర్ (Sarangapur) మండలంలోని డీజే నిర్వాహకులతో సోమవారం ఎస్సై శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు.

గణేష్ ఉత్సవాల్లో ఉన్నతాధికారులు జారీ చేసిన సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పరిమితికి మించి డీజే శబ్దాలు, బాక్సులను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. ముందస్తు చర్యల్లో భాగంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 11 మంది డీజే నిర్వాహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>