ఫామ్‌హౌస్ స్క్రిప్ట్ చదవుతున్న కేటీఆర్.. ప్రవీణ్ రావు ఫైర్

కలం, కరీంనగర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సొంత పరిజ్ఞానం లేదని.. ఫామ్‌హౌస్ నుండి వచ్చిన స్క్రిప్ట్ చదవడానికే పరిమితమయ్యారని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు (Praveen Rao) విమర్శించారు. కరీంనగర్ లో నిర్వహించిన సమర భేరీలో కేటీఆర్ ఫాంహౌజ్ నుండి వచ్చిన 12 పేజీల స్క్రిప్ట్ ను మాత్రమే వల్లె వేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలెవరినీ నమ్మడం లేదని ప్రవీణ్ రావు ఎద్దేవా చేశారు. ‘ఎవరు ఏ కార్యక్రమం నిర్వహించాలి? ఎవరు ఏం మాట్లాడాలనే అంశంపై ఫామ్‌హౌస్ లో తీసుకున్న నిర్ణయంతోపాటు అక్కడే రాసిచ్చిన స్ర్కిప్ట్ ను మాత్రమే చదివిస్తున్నారు. ఆఖరుకు కన్న కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావును కూడా కేసీఆర్ నమ్మడం లేదు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలపై చేపట్టే నిరసన కార్యక్రమాల డిజైన్లు, ఫ్లెక్సీలు సైతం ఫాంహౌజ్ నుండే బయటకు వస్తున్నాయి’ అని విమర్శించారు.

కేటీఆర్, హరీష్ రావులతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినందువల్లే ఫాంహౌజ్ నుండే స్క్రిప్ట్ లు వెళుతున్నాయని ప్రవీణ్ రావు మండిపడ్డారు. సొంతంగా తన భావాన్ని కూడా వ్యక్తం చేయలేని కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. బీఆర్ఎస్  పూర్తిగా ఒంటెద్దు పోకడలకే పరిమితమవుతోందని దుయ్యబట్టారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ ను సైతం సమర భేరీ సభలో మాట్లాడించే పరిస్థితి లేదంటే.. ఆ పార్టీ ఒంటెద్దు పోకడలను అర్ధం చేసుకోవాలని ప్రవీణ్ రావు విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కు ఎన్ని నిధులు తీసుకొచ్చారో, ఎన్ని పోరాటాలో చేశారో పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంటికి వెళ్లినా చెబుతారని అన్నారు. బండి సంజయ్ ను విమర్శించడమంటే ఆకాశంపై ఉమ్మి వేసినట్లేనని పేర్కొన్నారు. ఇకనైనా కేటీఆర్ నోటిని అదుపులో పెట్టకుని మాట్లాడాలని.. లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>