సఖీ కేంద్రాన్ని సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

కలం, నిర్మల్ : నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని ( Sakhi Centre) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.రవీందర్‌ శనివారం సందర్శించారు. కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు, బాధిత మహిళలకు కల్పిస్తున్న సహాయం, న్యాయపరమైన మద్దతు తదితర అంశాలను పరిశీలించారు. మహిళలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా సఖీ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సఖీ కేంద్రం కోఆర్డినేటర్‌ స్వాతిరాణి కేంద్రం పనితీరు, మహిళలకు అందిస్తున్న కౌన్సెలింగ్‌, న్యాయ సహాయం, ఇతర సేవల గురించి వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>