నిషేధిత భూమి పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేత.. అచ్చంపేటలో బాధితుడి ఆవేదన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం చూపించిన విధంగా నిషేధిత జాబితాలో కొన్ని సర్వే నెంబర్లను చూపించిన విషయం పాఠకులకు విధితమే. అయితే ఇదే అదునుగా చూపి కొంత మంది సబ్ రిజిస్టర్లు, దళారులు కుమ్మక్కు అవుతూ అమాయక ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అక్రమ వసూళ్లకు చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

ఇదే విషయంపై శనివారం ‘కలం’ మీడియా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) నియోజకవర్గంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో క్షేత స్థాయి పరిశీలన చేయగా.. గతంలో అచ్చంపేట శివారులోని సర్వే నంబర్ 110లో, గ్రామ పంచాయతీ అనుమతి పొందిన 121 చదరపు గజాల ఓపెన్ ప్లాట్ (ప్లాట్ నెంబర్ 57)కు సంబంధించిన యజమాని ఎల్ఆర్ఎస్ (LRS) రుసుమును కూడా చెల్లించారు. ప్రస్తుతం సదరు యజమాని తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆ ప్లాట్ ను వేరొకరికి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రభుత్వం సూచించిన విధంగా చలానా రుసుము కట్టి, దస్తావేజులను అధికారులకు సమర్పించారు.

అయితే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అధికారులు మాత్రం సదరు సర్వే నంబర్ 110/ఆ లో 2ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ (Land Registration) నిలుపుదల చేశారు. వాస్తవానికి బాధితుడి డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నంబర్ నిషేధిత జాబితాలో ఎక్కడా లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. అయినప్పటికీ, ఆ సర్వే నంబర్ లోని ఒక పార్ట్– బి ని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో అధికారులు తప్పుడు సాకులు చెబుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారి వివరణ కోసం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>